పోలీసులపై మానసిక వికలాంగుడి దాడి

కడప: కడప జిల్లా మైదుకూరులో ఓ మానసికక వికలాంగుడు హల్‌చల్‌ సృష్టించాడు. పోలీస్‌స్టేషన్‌లోకి చొరబడి సీఐ, కానిస్టేబుల్‌ సహా మరో ముగ్గురిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని అదుపులోకి తీసుకుని  బంధించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.