పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్లు
సుండుపల్లి: తమిళనాడుకు చెందిన ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లును బుధవారం అర్థరాత్రి కడప జిల్లా సుండుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శేషాచల పర్వతాల్లో విస్తారంగా ఉన్న ఎర్రచందనాన్ని తమిళనాడుకు చెందిన పలువురు స్మగ్లర్లు మండలంలో రాయవరం ప్రాంతం నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు బుధవారం అర్థరాత్రి దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు అప్పటికే అడవిలోకి పారిపోయి తప్పించుకున్నట్లు సమాచారం తెలిసింది.