పోలీసు కుటుంబాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి: డీజీపీ దినేష్‌రెడ్డి

కాకినాడ: పోలీసు కుటుంబాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు డీజీపీ దినేష్‌రెడ్డి తెలిపారు. తూగో జిల్లా కాకినాడలో తొలిసారిగా నిర్మించిన సబ్సిడరీ పోలీసు క్యాంటీన్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు కుటుంబాల నుద్ధేశ్యించి మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్‌లలో ఇదే మొదటిదన్నారు. ఈ క్యాంటీన్‌లో 22 నుంచి 35 శాతం వరకు సబ్సీడిపై సరకులు లభిస్తాయని తెలిపారు. అస్సామీల గొడవకు సంబంధించి మాట్లాడుతూ ఇది ఒట్టి వదంతులేనని కొట్టిపారేశారు. హోంగార్డుల సంక్షేమం గురించి మాట్లాఢతూ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సీపీ మధుసూదన్‌ రెడ్డి, ఐజీ రాజేంద్రనాథ్‌, రాజమండ్రి అర్బన్‌ ఎస్పీ రవికుమార్‌ మూర్తి, జిల్లా ఎస్పీ త్రివిక్రమ్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు