పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న నిందితుడి మృతి

ఉంగుటూరు : ఓ కేసులో నిందితున్ని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువస్తుండగా మార్గమధ్యలో మృతిచెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కైకరంలో అక్టోబర్‌ 12న ఓ వ్యక్తితో జరిగిన గొడవ కేసులో ఇల్లెందుల రామారావు (63)పై కేసు నమోదు చేసి ఈ ఉదయం అరెస్టు చేశారు. పోలీస్‌  స్టేషన్‌కు తీసుకువస్తుండగా గుండెపోటు రావడంతో నిందితుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించిన అనంతరం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.