పోలీస్ స్టేషన్ ముందు టీవీ ఆర్టిస్టుల ధర్నా
హైదరాబాద్: సీరియల్ చిత్రీకరణ చేస్తుండగా పోలీసులు కెమెరా లాక్కెళ్లారంటూ బుల్లితెర ఆర్టిస్టులు నార్సింగి పోలీస్‌స్టేషన్ ముందు ధర్నా చేశారు. ఈ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో అక్కాచెల్లెళ్లు సీరియల్ చిత్రీకరిస్తుండగా స్థానికుల ఫిర్యాదుపై పోలీసులు వచ్చి అనుమతి లేదంటూ అడ్డుకుని కెమెరా లాక్కుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆర్టిస్టులు ధర్నా చేశారు.