ప్రకాశం జిల్లా డెయిరీ ఛైర్మన్‌ శ్రీనివాసరావు అపహరణ

జార్ఖంఢ్‌: ప్రకాశం జిల్లా డెయిరీ ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసరావు జార్ఖండ్‌లో అపహరణకు గురయినట్లు పోలిసులకు ఫిర్యాదు అందింది. జార్ఖండ్‌లోని సాహెభ్‌గంజ్‌ బరాత్‌ రోడ్డులో గురువారం రాత్రి 10.30 గంటలకు చల్లా శ్రీనివాసరావును అపహరించినట్లు తమకు ఫిర్యాదు అందిందని సాహెబ్‌గంజ్‌ ఎస్పీ విజయలక్ష్మి తెలిపారు. చల్లా శ్ర్షీనివాసరావు జార్ఖండ్‌లో రూ. 120 కోట్లతో రహదారి నిర్మాణ పనులు చేస్తున్నారని చెప్పారు. అయన అచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.