ప్రజలు శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి.


– బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ శంకరయ్య.
ఫొటో : పీస్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న సీఐ.
బెల్లంపల్లి, మార్చ్ 21, (జనంసాక్షి )
ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలని బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ శంకరయ్య అన్నారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్లో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాబోయే రంజాన్, ఉగాది, శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి పండగలు ఉన్నందున ప్రజలు అందరు కలిసిమెలిసి శాంతియుత వాతావరణంలో పండగలు నిర్వహించుకోవాలన్నారు. పండగలు ఉన్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావు లేకుండా చూడాలని అన్నారు. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా ప్రశాంత వాతావరణంలో అందరూ కలిసిమెలిసి పండగలు జరుపుకోవాలని సూచించారు. రెచ్చగొట్టే సందేశాలు, కించపరిచే సందేశాలు, కవ్వింతలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా వేసి ఉంచామని, అలాంటి సందేశాలు, కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.