ప్రజల సమస్యలు తీర్చేందుకే ఇందిరమ్మ బాట:సీఎం

రాజమండ్రి:ప్రజలవద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను తీర్చడమే ఇందిరమ్మ బాట లక్ష్యమని  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఆయన ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు.ఈ రోజంతా ముఖ్యమంత్రి ఏజన్సీలోని వివిద ప్రాంతాల్లో పర్యటించనున్నారు.