ప్రజావాణి పెండింగ్ ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి 

జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు
రంగారెడ్డి ఇబ్రహీంపట్నం, మార్చి06(జనంసాక్షి)
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్ ఉన్న అర్జీలనుసత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ తిరుపతి రావు అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 60 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ తిరుపతి రావు, జిల్లారెవెన్యూ అధికారి హరిప్రియలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ,
సమస్యలను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ తిరుపతి రావు అధికారులనుఆదేశించారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్ లైన్ లో అప్లోడ్ చేయడంతో పాటు అర్జీదారులకు సమాచారం అందించాలని సూచించారు.  అన్ని శాఖలకు చెందిన
జిల్లా స్థాయి అధికారులే విధిగా ప్రజావాణికి హాజరు కావాలని, ఒకవేళ అత్యవసరంగా రాలేని పరిస్థితి ఉంటే జిల్లా పాలనాధికారి అనుమతి తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.