ప్రణబ్‌కు అభినందనల వెల్లువ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ప్రణబ్ ముఖర్జీకు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధాని మన్మోహన్‌సింగ్, లోక్‌సహ స్పీకర్ మీరాకుమార్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీలు, కేంద్ర మంత్రులు ఆయన్ను కలుసుకొని ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ప్రణబ్‌కు నా అభినంవదనలు. నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు. నాకు మద్దతు తెలిపిన భాజపా అగ్రనేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.