ప్రణబ్‌కు ఓటు వేయ్యాద్దు

అన్ని ఓయులో టీ కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌ : తెలంగాణ టీ- కాంగ్రెస్‌ నేతలపై తెలంగాణ ఓమూ విద్యార్థులు మరోసారి నిప్పులు చెరిగారు. ఈ రోజు ఉస్మానియా యునివర్సిటీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విద్యార్ధులు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు,ఎమ్మెల్యేల దిష్టి బొమ్మల దహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్ధి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తోన్న ప్రణబ్‌ ముఖర్జీ తెలంగాణ పై స్పష్టమైన వైఖరి ప్రకటించే వరకు ఆయనకు మద్దతు ఇవద్దని తెలంగాణ నేతలను విద్యార్థులు డిమాండ్‌ చేశారు.