ప్రణబ్‌కు ప్రత్యర్థి అభినందనలు

ఢిల్లీ: భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్‌కు ప్రత్యర్థి నుంచి అభినందనలు అందాయి. ఓట్ల లెక్కింపు అనంతరం సంగ్మా మాట్లాడుతూ.. ప్రణబ్‌కు అభినందనలు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో తనకు ఓట్లు తగ్గడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తనకు మద్దతు ప్రకటించిన భాజపా అగ్రనేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యావాదాలు తెలుపుతున్నట్లు సంగ్మా వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికలపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు.