ప్రణబ్‌జీ తెలంగాణకు సహకరించండి

రాష్ట్రపతిని కలిసిన ‘టీ’ కాంగ్రెస్‌ నేతలు
రామగుండం, ఆగష్టు 24, (జనంసాక్షి):
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు విషయంలో శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రపతిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి నాలుగున్నర కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను ఆయనకు విన్నవించారు. రాష్ట్ర ప్రక్రియపై రాష్ట్రపతిని కలిసి తెలంగాణ రాష్ట్రప్రక్రియను చేపట్టాలని రాష్ట్రపతికి విన్నవించినట్లు ఏఐసిసి హర్కర వేణుగోపా ల్‌రావు ‘జనంసాక్షి’కి తెలిపారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఏఐసిసి సభ్యులు హర్కర వేణుగోపాల్‌రావుతో పాటు ఆర్టీసి చైర్మన్‌ ఎం.సత్యనారాయణరావు, ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, రాజయ్యలతో పాటు తదితరలు పాల్గొన్నారు. రాష్ట్రపతికి ఎన్నికైన ప్రణబ్‌ముఖర్జీకి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.