ప్రధాని రాజీనామా చేయాలి: కేజ్రీవాల్‌

లక్నో: విదేశా వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ అక్రమాలపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసేందుకు వెళ్తే తన అనచరులను అరెస్టు చేసి జైల్లో పెట్టారని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఖుర్షీద్‌ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తన అనుచరులను అక్రమంగా జైల్లో పెట్టించినందుకు ప్రధాని తన పదివికి రాజీనామా చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన ఖుర్షీద్‌ను అరెస్టు చేయాలిని డిమాండ్‌ చేశారు. తాము ఖుర్షీద్‌కు భయపడుతామని ఆయన భావించినట్లుందని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫరుకాబాద్‌ నుంచి వికలాంగ అభ్యర్ధిని గెలిపించాలని కేజ్రీవాల్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో గెలిచినవారు ప్రజలను మరిచి సోనియా కోసం ప్రాణాలిస్తామంటున్నారని విమర్శించారు. న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సల్మాన్‌ ఖుర్షీద్‌ అక్రమాలకు పాల్పడ్డారని కేజ్రీవాల్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. సభకు ర్యాలీగా చేరుకుంటున్న సమయంలో కేజ్రీవాల్‌ అనుచరులపై ఖుర్షీద్‌ వర్గం దాడి చేశారు.