ప్రపంచంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం : నారాయణ
సిరిసిల్ల : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వంగా మారిందని, రాష్ట్రంలో దొంగల పాలన సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ సాధన కోసం సీపీఐ చేపట్టిన ప్రజాపోరు యాత్ర శనివారం కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో సాగింది. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ కిరణ్ ప్రభుత్వంలో మంత్రులు జైళ్లకు పోతున్నారని అన్నారు. నేతకార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజిలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే నట్టేట ముంచుతారని 2004లో తాను చెప్పిన మాట నిజమైందని ఆయన పేర్కోన్నారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ప్రకటించకుండా ఎంత మంది ముఖ్యమంత్రులను మార్చిన లాభం లేదని ఆయన పేర్కోన్నారు. తెలంగాణపై అనుకూల నిర్ణయం తీసుకోకపోతే తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.