ప్రభుత్వం మేలుకొని రైతులకు సకాలంలో ఎరువులు అందించాలి: రావుల

హైదరాబాద్‌ : రాష్ట్ర రైతాంగానికి అవసరమైన ఎరువులను ప్రభుత్వం సకాలంలో సరఫా చేయాలని తెలుగుదేశం నేత రావుల చంద్రశేఖరరెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వం సహజ పరిష్కారాల కోసం వెతుకులాడుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని రైతులకు సత్వరమే ఎరువులను అందించాలని ఆయన కోరారు.