ప్రభుత్వానికి ప్రైవేటీకరణపైనే మక్కువ: నారాయణ

కడప: ప్రభుత్వం ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలను ప్రోత్సహిస్తోంది తప్ప ప్రభుత్వం నిర్వహించే వాటిపై దృష్టిపెట్టడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ప్రభుత్వానికి ప్రైవేటీకరణ అన్నా, కార్పొరేట్‌ సెక్టార్‌ అన్నా మక్కువ ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కడప వచిచన నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పరిధిలో వున్న విద్యావ్యవస్థను క్రమంగా ప్రైవేటు సెక్టార్‌వైపు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. ఇబ్బడిముబ్బడిగా ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలను ప్రోత్సహించడం వల్లే ప్రభుత్వ కళాశాలలు దిగజారి పోతున్నాయని నారాయణ అభిప్రాయపడ్డారు. ఆరోగ్యశ్రీలో కూడా ప్రభుత్వం ఇలాంటి ధోరణే అవలంభిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.