ప్రభుత్వాసుపత్రిలో మెరుౖగైన వైద్య సేవలకు ప్రత్యేక చర్యలు
–రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్
–జోగిపేట ఏరియా అసుపత్రి సందర్శన…
అందోల్: జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించేందుకు మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో ప్రణాళిక బద్దంగా చర్యలు చేపట్టిందని రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ అన్నారు. ప్రభుత్వ అసుపత్రుల్లో కోత్త మార్గదర్శకాలు వచ్చిన తర్వాతనే కుటుంబ నియంత్రణ అపరేషన్లను ప్రారంభిస్తామన్నారు. బుధవారం జోగిపేటలోని ఏరియా అసుపత్రిని ఆయన అకస్మీకంగా తనిఖీ చేశారు. ఇటీవల ప్రభుత్వాసుపత్రిలో కు.ని. అపరేషన్ చేయడంతో మృతి చెందిన ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణను చేపడుతున్నాయన్నారు. తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 30 జిల్లాలో పర్యటించానని, అసుపత్రుల పనితీరును పరిశీలించినట్లు తెలిపారు. ఆయా అసుపత్రుల్లోని సదుపాయాల కల్పన, డాక్టర్లు, సిబ్బంది కొరత వంటి ఇతరత్రా అంశాలపై ఆరా తీసి, నివేదికను సిద్దం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సమయపాలన పాటించే విధంగా అసుపత్రుల్లో బయోమెట్రీక్ విధానాన్ని అన్ని అసుపత్రుల్లో ఏర్పాటు చేయిస్తామన్నారు.
అసుపత్రిలో మంచిగా చూస్తున్నారా?
జోగిపేట అసుపత్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది మంచిగా చూస్తున్నారా? అంటూ రోగులను అడిగి తెలుసుకున్నారు. భోజనాన్ని సకాలంలో అందిస్తున్నారా? గుడ్డు, అరటి పండ్లు ఇస్తున్నారా? వైద్యం చేసినందుకు ఏమైనా డబ్బులు అడుగుతున్నారా? అసుపత్రిలో సదుపాయాలు ఏలా ఉన్నాయంటూ రోగులను అడిగి తెలుసుకున్నారు. మంచి నీళ్లు లేవని, డబ్బులు అడగడం లేదని, వైద్య సేవలు బాగున్నాయంటూ రోగులు చేప్పారు. అసుప్రతిలో ఎన్ని కాన్పులు అయ్యాయి? నార్మల్ ఎన్ని? అపరేషన్లు ఎన్ని? అంటూ డాక్టర్ వీణాను అడిగి తెలుసుకున్నారు. అసుపత్రిలో మినరల్ వాటర్ ప్లాంట్‌కు ప్రతిపాదనలు ఇవ్వాలని, ఇంకా ఏమైనా సమస్యలుంటే నివేదిక ద్వారా అందించాలనిç అసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రమేష్‌ను ఆదేశించారు. రోగులకు ఇబ్బంది కలుగకుండా వైద్య సేవలందించాలని ఆయన సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట డీసీహెచ్ డాక్టర్ సంగారెడ్డి, డాక్టర్ శంకర్బాబుతో పాటు సిబ్బంది తదితరులు ఉన్నారు.