ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు
పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 28 (జనం సాక్షి): భారత స్వతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర వహించి బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రించిన భారత విప్లవ స్వతంత్ర ఉద్యమకారుడు భగత్ సింగ్ జయంతి వేడుకలను బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం చిత్రపటానికి పూలమాల వేసి చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ లాంటి వారి కృషి ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని, అటువంటి వారి త్యాగాలను భవిష్యత్ తరాలకు అందజేయాలని దానికోసం ముఖ్యంగా యువత కృషి చేయాలని అన్నారు. ఆదర్శనీయమైన స్వాతంత్ర ఉద్యమకారుల్లో భగత్ సింగ్ కీలకమైన వారని, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజ్పత్ రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు భగత్ సింగ్ ను ఉరితీశారని, అతను ఉత్తరదాయిత్వం భారత స్వాతంత్ర్య సిద్ధికి పోరాడేలా భారత యువతను ప్రేరేపించిందని అన్నారు. స్వాతంత్ర ఉద్యమకారులను స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.