ప్రమాదంలేదని తెల్సిన జాలర్లపై కాల్పులు జరిపారు

దుబాయి : భారతీయ మత్స్యకారులపై అమెరికా నేవీ దళాలు జరిపిన కాల్పుల ఘటనపై యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌ అధాకారులు స్పందించారు. జాలర్ల బోట్‌ తమ హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో కాల్పులు జరిపినట్లు అమెరికా నేవీ చేస్తున్న వాదనలను తప్పుబట్టారు. ఆ బోటుతో ఎలాంటి అపాయం లేకపోయినప్పటికీ నేవీ కాల్పులకు పాల్పడినట్లు తమ ప్రాథమిక విచారణలో తెలినట్లు దుబాయి పోలిసు అధికారి దహీ ఖల్ఫన్‌ తమీమ్‌ అన్నట్లు అక్కడి వార్త పత్రిక ‘ద నేషనల్‌’ తెలిపింది. ఈ ఘటనపై పూళిఐర్తి స్థాయి విచారణ చేపట్టాలని యూఏఈ అధికారులను అబూదాబీలోని భారతీయ దౌత్యాధికారులు కోరారు. దుబాయి సముద్ర ప్రాంతంలో సోమవారం అమెరికా నేవీ దళాలు జరిసిన కాల్పుల్లో తమిళనాడు రాష్ట్రానికి చేందిన ఒక మృత్స్యుకారుడు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. ఈ గటనపై కేసు నమోదు చేసిన యూఏఈ అధికారులు దర్యాప్తు చేపట్టారు.