ప్రముఖ గజల్‌ గాయకుడు మెహదీ హసన్‌ ఇక లేరు

కరాచి : ప్రముఖ పాకిస్తాన్‌ గజల్‌ గాయకుడు మెహిదీ హసన్‌ బుధవారంనాడు కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న విషయం తెలిసిందే. నెల రోజుల క్రితం ఆయన్ను ఇంటికి పంపించివేశారని, అయితే రెండు రోజుల క్రితం మళ్లీ ఆరోగ్య సమస్యలను తలెత్తడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించామని ఆయన కుమారుడు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారని చెప్పారు. ఇదిలా ఉండగా పాకిస్తానీ గాయకుడు హసన్‌ మృతి పట్ల సంగీత సమ్రాట్‌లు సంతాపం ప్రకటించారు. హసన్‌ 1927లో రాజస్థాన్‌లోని లునా గ్రామంలో జన్మించారు. 1947లో ఆయన కుటుంబం పాకిస్తాన్‌లో స్థిరపడింది. ఆయన అక్కడి నుంచే తన ప్రస్తానాన్ని కొనసాగించారు.