ప్రశాతంగా ముగిసిన డైట్‌ సెట్‌

హైదరాబాద్‌: డైట్‌ సెట్‌ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 3,18,991 మంది హజరుకాల్సి ఉండగా 39,924మంది గైర్హాజరయ్యారు. మొత్తం 87.5శాతం హజరు నమోదైనట్లు కన్వీనరు సురేంద్రరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 91.8శాతం, గుంటూరులో అత్యల్పంగా 79.4శాతం మంది హజరైనట్లు చెప్పారు.