ప్రాంతాల వారీగా మెడికల్‌ సీట్లు చూడటం సరికాదని : కొండ్రు మురళి

హైదరాబాద్‌: ప్రాంతాల వారీగా మెడికల్‌ సీట్ల కేటాయింపును చూడటం సరికాదని, తెలంగాణకు తక్కువ సీట్లు వచ్చాయని అనడం సమంజసం కాదని రాష్ట్ర్ర వైద్య,విద్యా శాఖ మంత్రి కొండ్రు మురళి అన్నారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.దేశంలో అత్యధిక మెడికల్‌ సీట్లు ఉన్న రాష్ట్రం మన దేనని తెలిపారు. ప్రాంతాల వారీగా సీట్లను చూస్తే ఆంధప్రాంతాల్లో 2,300 తెలంగాణలో 2250, రాయలసీమలో 950 మెడికల్‌ సీట్లు ఉన్నాయని వెల్లడించారు. అయితే కొత్తగా 750 మెడికల్‌ సీట్లు రాష్ట్రానికి మంజూరయ్యాయని తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి తక్కువ సీట్లు వచ్చాయని అంటే విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోందని పేర్కోన్నారు.