ప్రాణ హాని నుంచి రక్షించాలి

కడప, జూలై 28 : ఉద్యమాలు చేస్తున్న తనను కొందరు హత్య చేసేందుకు కుట్ర పన్నారని రాయలసీమ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి చెప్పారు. కొంత మంది తమ ఉద్యమాల వల్ల నష్టపోతున్న కొంత మంది తనను హత్యచేసేందుకు పధకం వేసినట్లు తన వద్ద సమాచారం ఉందని ఆయన ఎరగుంట్ల సిఐ రామకృష్ణుడుకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సిమెంటు ధరలను తగ్గించాలని తాను ఆందోళన చేశామని అన్నారు. అలాగే ఆర్‌టిపిపిలో కాంట్రాక్టు టెక్‌ప్రో,,,, కంపెనీపై లోకాయుక్తలో కేసు దాఖలు చేసానని అన్నారు. వాస్తవానికి వ్యక్తిగతంగా తనకు ఎవరూ శత్రువులు లేరని అన్నారు. ఈ ఉద్యమాల వల్ల నష్టపోతున్న వారి వల్లే తన ప్రాణాన్నికి ముంపు ఉందని ఆయన పోలీసులకు చెప్పారు. తన ప్రాణానికి హాని కలగకుండా రక్షణ కల్పించాలని ఆయన సిఐ లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.