దేశ్‌ముఖి సర్పంచ్‌గా దుర్గం జంగయ్య బాధ్యతల స్వీకరణ

భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 23 (జనం సాక్షి): మండల పరిధిలోని దేశ్‌ముఖి గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ దుర్గం జంగయ్య సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గ్రామ సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప సర్పంచ్ నూకల అశోక్‌తో పాటు వార్డు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహనీయుల ఆదర్శాలను అనుసరించి గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని సర్పంచ్ దుర్గం జంగయ్య తెలిపారు.



