ఎమ్మెల్యే కుంభం సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా

భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 23(జనం సాక్షి):
జూలూరు సర్పంచ్ కాసుల అంజయ్య
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో జూలూరు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని సర్పంచ్ కాసుల అంజయ్య అన్నారు. మండలంలోని జూలూరు గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌గా కాసుల అంజయ్య, ఉప సర్పంచ్ దాసరి నరసింహ, వార్డ్ మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ కళ్లెం రాఘవ రెడ్డి, మండల అధ్యక్షులు పాక మల్లేష్ యాదవ్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



