లక్ష్మీ తండా సమగ్రాభివృద్ధికి కృషి

సూర్యాపేట(జనంసాక్షి):గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటానని లక్ష్మీ తండా నూతన సర్పంచ్ లునావత్ విష్ణు నాయక్ అన్నారు.సోమవారం సూర్యాపేట మండలం లక్ష్మీ తండ గ్రామ పంచాయతీలో ఆర్వో గోపికృష్ణ, పంచాయతీ సెక్రెటరీ ఆశా సుల్తానా ఆధ్వర్యంలో నూతన సర్పంచిగా పదవి బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలతో కలిసి పనిచేస్తానని తెలిపారు.గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ముందుంటానని తెలిపారు.గ్రామ ప్రజలందరినీ కలుపుకుని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తానని తెలిపారు.అనంతరం నూతనంగా ఎన్నికైన వారిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్ జగపతి, ఆనంద్, పాండు నాయక్ ,నికిత, ఫుల్ సింగ్, జాటోత్ వినోద్, అనిత, హేమ్ సింగ్, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



