ప్రారంభమైన టీటీడీ పాలకమండలి సమావేశం
తిరుపతి : టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. ఇక్కడి అన్నమయ్య భవన్‌లో పాలక మండలి సభ్యులతో ఛైర్మన్ భేటీ అయ్యారు. టీటీడీ పరిధిలోని పలు సమస్యలపై వారు చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే నూతన సంవత్సర డైరీలను టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవోలు ఆవిష్కరించారు.