ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ

ఆదిలాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి):   సింగరేణిలో ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 28వ త ేదీన కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నాడు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 14 కార్మిక సంఘాలకు పోటీ చేసేందుకు అర్హత లభించింది. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 11వ తేదీ వరకు గడువు ఉంది. 12వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13వ తేదీన ఉప సంహరణకు గడువు విధించింది. సింగరేణి సంస్థలో రహస్య బ్యాలట్‌ పద్ధతి ద్వారా కార్మిక సం ఘాలకు గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి. రెండునెలలకు ఒక్కసారి ఈ గుర్తింపు ఎన్నికలు నిర్వ హిస్తూ వస్తారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎంపికలు జరగగా రెండుసార్లు ఐఎన్‌టియుసి, రెం డుసార్లు ఎఐటియుసి ప్రాతినిధ్యం వహించాయి. ఐదవ సారి జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రధాన సం ఘాలైన ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాలు ప్రధానంగా పోటీ పడు తున్నాయి. జిల్లాలోని సింగరేణిలో సుమారు 23 వేల మంది కార్మికులు ఓటు హక్కును విని యోగించుకోనున్నారు. కాగా శుక్రవారం నాడు ఐఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్‌, తెలంగాణ బొగ్గుగణి కా ర్మిక సంఘాలు తమ నామినేషన్లను వేసేందుకు నిర్ణయించారు. శనివారం కార్మిక ప్రధాన  సంఘమైన ఎఐటియుసి నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎంతో ప్రతి ష్ఠాత్మకంగా తీసుకున్న ఈఎన్నికలను కార్మిక సంఘాలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు.