ఫేస్‌బుక్‌లో కలాం

ఢిల్లీ : సామాజిక నెట్‌వర్కింగ్‌ సైట్లలో చేరుతున్న ప్రముఖుల్లో తాజాగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పేరు చోటుచేసుకుంది. దేశాభివృద్ధికి సంబంధించి పలు కోణాల్లో నిర్మణాత్మక చర్చ లేవనేత్తే అబ్దుల్‌ కలాం ఇప్పుడిక తన అలోచనలను ఫేస్‌బుక్‌ ద్వారా అందరితో పంచుకొనున్నారు. 81 ఏళ్ల అబ్దుల్‌ కలాం ఇప్పటికే యూ ట్యూబ్‌ వీడియో షేరింగ్‌లో ఉన్నారు. తన ఫేస్‌బుక్‌ పేజికి బిలియన్‌ బీట్స్‌ అని కలాం పేరు పెట్టారు. ఇప్పటికే తను నిర్వహిస్తున్న ఈ పేపర్‌కి ఇది ఎక్స్‌టెన్షన్‌ అని అయన పేర్కొన్నారు.