ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ఏసీబీ స్పష్టంగా చెప్పింది:హరీష్ రావు

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ఏసీబీ స్పష్టంగా చెప్పిందని తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ అధికారులు తన పని తాము చేస్తారని తెలిపారు. కేసీఆర్ పై ఏపీ ప్రభుత్వం కేసులు ఎందుకు వేస్తుందో అర్ధం కావట్లేదన్నారు. అరెస్టుల పై ఏపీ మంత్రులు చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తమ తనప్పులు కప్పిపుచ్చుకునేందుకే ఇలా చేస్తున్నారని విమర్శించారు.