బండరాళ్లను పేల్చివేస్తుండగా రాయి తగిలి ఒక వ్యక్తి మృతి

హైదరాబాద్‌: బండరాళ్లను పేల్చివేస్తుండగా రాయి తగిలి ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన నగరశివారు రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ బండ్లగూడ సన్‌సిటిలో జరిగింది. ఓ వ్యక్తి తన ప్లాటులో ఉన్న బండరాయిని పగలగొట్టేందుకు కంప్రెషర్‌ బ్లాస్టింగ్‌ చేయగా పగిలిన రాయి ముక్క ఎగిరివెళ్లి 200 మీటర్ల దూరంలో ఉన్న టిప్పర్‌ క్లీనర్‌ ఆసిఫ్‌ అలీ కాళ్లపై పడింది. బలంగా బండరాయి ముక్క వచ్చి తగలడంతో తీవ్ర గాయాలైన అసిఫ్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతిచెందాడు. రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.