బడి బంధం మరువ లేనిది..బడి బంధం మరువ లేనిది.

పదవ తరగతి చదువును విజయవంతంగా పూర్తి చేసుకుని ఏప్రిల్ మూడవ తేదీ నుండి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షల రాయడానికి  నుండి హాల్ టికెట్స్ తీసుకొని పాఠశాల  అడుగు జాడలను..బడి విద్యార్థిగా  వదిలి వెళ్ళిపోతున్న సమయంలో పలువురు విద్యార్థుల అంతా ఒక్కసారిగా భారమైన మానసిక ఉద్వేగానికి గురయ్యారు. తప్పులు చేస్తే క్షమించండి సార్ అంటూ బోరుమన్నారు.ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు పెనవేసుకున్న   బడి బందాలను వదలలేక..కాళ్ళు కదల్చలేక..మీతో ఒక్క ఫోటో ప్లేస్.. ఒక సెల్ఫీ సార్ .. చివరి జ్ఞాపకంగా ఒక్క గ్రూప్ పోటో ప్లేస్ అంటూ… ఫోటోలు దిగుతూ ఆఖరు క్షణాల్ని మధురమైన జ్ఞాపకాలతో.. పంచుకోవడం ఆకట్టుకుంది.పరస్పరం కరచాలనాలు ఇస్తూ.. అన్న దమ్ముల్లా ఆత్మీయ ఆలింగనాలు చేస్తూ.. ఆటోగ్రాఫ్ తీసుకుంటూ పరస్పరం “ఆల్.. ది బెస్ట్..”. చెప్పుకున్నారు..విద్యార్థి జీవితంలో బడి బంధం భద్రమైందని అమ్మలాంటి బడి చదువుల గుడి అనుబంధాలకు ఒడిగా ఉండాలని మళ్లీ మీరంతా ఉన్నత స్థాయికి ఎదిగి ఈ పాఠశాలలో కలుసుకోవాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ పలువురుగురువులు విద్యార్థులకు విజయీభవ అంటూ ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో.. ఉపాధ్యాయులు వేణుగోపాల్,జాతీయ ఉత్తమ ఉపాద్యాయుడు గుండేటి యోగేశ్వర్, సి.శ్రీనివాస్, రాజయ్య,మహేష్. శ్రీనివాస వర్మ రాజమౌళి, ఉదయ్ ,  గోలి మనోహర్, చారి, హరిదాస్,  సునీత దేవి భాగ్యలక్ష్మి, అసీనా, స్వప్న తదితరులు పాల్గొన్నారు..