బహ్రైన్‌లో పేలుళ్లు : ఇద్దరి మృతి

బహ్రైన్‌ : నవంబర్‌ 5, (జనంసాక్షి):
బహ్రైన్‌ రాజధాని మనామాలో సోమవారం ఐదు దేశీయంగా తయారయిన బాంబులు పేలడంతో ఇద్దరు కార్మికులు మరణించగా మరొకరు గాయపడ్డారని ప్రభుత్వ వార్తాసంస్థ పేర్కొంది. ఇది టెర్రరిస్టుల పని కావచ్చని అభిప్రాయపడింది. ఈ ఏడాది పలు పర్యాయాలు పోలీసులను లక్ష్యంగా చేసుకొని పేలుళ్లు జరిగాయి. దాంతో ప్రభుత్వం తిరుగుబాటు చర్యలను అణచివేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 2011 ప్రథమార్థంలో ప్రజాస్వామ్యం కోసం ఇక్కడ జనాభాలో అధికులు షియా ముస్లింలు. వారిని సున్నీ శాఖకు చెందిన ఆల్‌ఖలీఫా కుటుంబం పాలిస్తోంది. వీరు యుఎస్‌కు మిత్రపక్షంగా ఉన్నారు. సోమవారం నాటి పేలుళ్లు మనామాలోని క్వాదాయిబియా, ఆడ్లియా జిల్లాలలో చోటుచేసుకున్నట్లు బిఎన్‌ఎ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. వీటిని దేశీయంగా తయారు చేసిన బాంబులుగా గుర్తించారు. ఈ పేలుళ్లలో మరణించిన ఇద్దరు, గాయపడిన మరొకరు ఆసియా వాసులే.