బాపట్లలో సమైక్యాంధ్ర మహాసభ:గాదె
హైదరాబాద్: తెలుగు మాట్లాడే వారంతా కలిసి ఉండాలని కోరుతూ త్వరలో గుంటూరు జిల్లా బాపట్లలో మహాసభ ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ సీనియర్‌నేత, మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి ప్రకటించారు. తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతూ 1913లో బాపట్లలో మహాసభ జరిగిందని దాని ఫలితంగా ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించిదని గుర్తు చేశారు. సమైక్యాంధ్రను కోరుకునేవారంతా కలిసి రావాలని విజ్ఞప్తిచేశారు.