బిఆర్ఎస్ ఏర్పాటుతో బిజెపిలో వణుకు..! – ఈడి, సిబిఐ లతో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్న
బిజెపి జనం సాక్షి, మంథని : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కావాలని ఇబ్బందులకు గురి చేస్తోందని పెద్దపల్లి జిల్లా జెడ్పి చైర్మన్ పుట్ట మధు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని లోని తన రాజగృహ నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కవితకు మంథని నియోజకవర్గ తరపున పూర్తిస్థాయిలో మద్దతు పలుకుతున్నామన్నారు. బీఆరేస్ పార్టీ పెట్టాక బీజేపీలో భయం మొదలైనదన్నారు. తమకు అడ్డు వచ్చిన వాళ్ళను ఈడీ, సిబిఐ పేర్లతో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో భూపాలపల్లి జిల్లా జెడ్పి చైర్ పర్సన్ జక్కు హర్షిణి రాకేష్, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, ప్యాక్స్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్ గౌడ్ , రాజాపూర్ సర్పంచ్ పాశం ఓదెలు, కాపరబోయిన భాస్కర్ తదితర నాయకులు పాల్గొన్నారు.