బీజేపీ ర్యాలీలో ఉద్రిక్తత, నేతల అరెస్టు

హైదరాబాద్‌: బీజేపీ ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత చోటేచేసుకుంది. పోలీసులు బీజేపీ నేతలను అరెస్టు చేశారు. సుందరయ్య పార్క్‌ నుంచి సచివాలయం ముట్టడికి బయలుదేరిన ర్యాలీ ఇందిరాపార్క్‌ వద్దకు చేరుకుంది, బీజేపీ నేతలు, కార్యకర్తలు సచివాలయం వైపు దూసుకు పోతుండటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. రోడ్డుపై బ్యారీకేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో వారు రోడ్డు భైఠాయించారు. పోలీసులు, బీజేపీ నేతల మథ్య  తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది, పోలీసులు బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, కే లక్ష్మన్‌, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.