బీడీ కార్మికులకు కరువుభత్యం బకాయిలు చెల్లించాలి’
జగిత్యాల: బీడీ కార్మికులకు పెరిగిన కరువు భత్యం బకాయిలను వెంటనే చెల్లించాలని బీడీ కార్మిక సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుతారి రాములు డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాలలోని బీడీ కార్మిక సంఘ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ టెలిఫోన్, దేశాయ్ బీడీ యాజమాన్యాలు రెండు నెలలుగా పెరిగిన బకాయిలను చెల్లించడం లేదన్నారు. బీడీ యాజమాన్యాలు డబ్బులను ఎగవేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్, ప్రభుత్వ లేబర్ కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు దృష్టి పెట్టి బకాయిలు చెల్లించని కంపనీ యాజమాన్యాలపై లేబర్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు