బీసీ విద్యార్థుల బోధనా రుసుం మొత్తాన్నీ సర్కారే భరించాలి

హైదరాబాద్‌: బీసీ విద్యార్థుల బోధన రుసుములపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులను ప్రభుత్వం తిరస్కరించాలని భాజపా డిమాండ్‌ చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎన్‌వీఎన్‌ఎన్‌ ప్రబాకర్‌ కోరారు. బుధవారమిక్కడ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మట్లాడారు. కౌన్సెలింగ్‌ తేదీలపై నాన్చుడు ధోరణి అనుమానాలకు తావిస్తోందన్నారు. భాజపాను మతతత్వ పార్టీగా విమర్శించేవారే కుహనా లౌకికవాదులని విమర్శించారు. ప్రభుత్వ అండతోనే ఓ పార్టీ మతమార్పిడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇలాంటి చర్యల్ని భాజపా చూస్తురుకోదని హెచ్చరించారు.