బూట్లపై బుద్దుడి చిత్రాలు

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన ఓ పాదరక్షల కంపెనీ బౌద్ద మతస్థుల మనోభావాలను దెబ్బతీసేల వ్యవహరించింది. బూట్లపై బుద్ధుడి చిత్రాలను ముద్రించింది. దీనిపై టిబెటన్లు, బౌద్ధ సమాజం తీక్రస్థాయిలో నరసన వ్యక్తం చేస్తోంది. బూద్ధుడిని మేమంతా భక్తిభావంతో కొలుస్తాం. పాదరక్షలపై దేవుడి బొమ్మను ముద్రించడమంటే మమ్మల్ని అగౌరపరచడమే అని టిబెట్‌ విముక్తి కోసం అంతర్జాతీయస్థాయిలో ప్రచారం చేస్తున్న భుచుంగ్‌ సెరింగ్‌ అన్నారు. బూట్లపై బుద్ధుడిని చిత్ల్రాను తొలగించాలని వజ్ఞప్తి చేశారు. ఐకాన్‌ సంస్థ తక్షణమే బౌద్ధ మతస్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని బిబెట్‌ పార్లమెంట్‌ సభ్యుడు తషీ నామ్‌గ్యాల్‌ డిమాండ్‌ చేశారు. వివాదాస్పద బూట్ల ఉత్పత్తిని నిలిపివేయాలన్నారు. బౌద్ధుల నుంచి పెద్దఎత్తున నిరసన వ్యక్తమవుతున్నప్పటికీ ఐకాన్‌ సంస్థ స్పవందించక పోవడం గమనార్హం.