బెయిల్‌ కోసం పట్టాభి పిటిషన్‌

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణంలో అరెస్టైన జడ్జి పట్టాభిరామారావు తనకు బోయిల్‌ మంజూరు చేయాలంటూ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రోజు ఆయన తన తరుపు న్యాయవాదితో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయించారు. ఓఎంసీ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్ధన్‌కి బెయిల్‌ ఇవ్వడానికి పది కోట్ల రూపాయలు ముడుపులు స్వీకరించారనే ఆరోపణలొచ్చాయి. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. ఇప్పుడు ఆయన చర్తపల్లి జైల్లో ఉంటోన్న సంగతి తెలిసందే.