బేఫికర్‌ గా ఉండండి

share on facebook


జర్నలిస్టుల ఇళ్లస్థలాల బాధ్యత నాదే

టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భరోసా

హైదరాబాద్‌ 07 మార్చి (జనంసాక్షి):

తెలంగాణలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటానని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ హావిూ ఇచ్చారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న ప్పటికీ ఆ బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశా రు. నగరంలోని జలవిహార్‌లో జరిగిన తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు ప్రతినిధుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డారు. జర్నలిస్టులు, ఉద్యోగులు, న్యాయవాదులతో తెరాసకు ఉన్నది పేగు బంధమని గతంలో జరిగిన పలు సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

మరణించిన 260 మంది కుటుంబాలకు సాయం..

”జర్నలిస్టులకు రూ.100 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పా టు చేశాం. మరణించిన 260 మంది కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఇచ్చాం. ఇలాంటి ప్రభుత్వం దేశం లో ఎక్కడా లేదు. జర్నలిస్టుల కుటుంబాల పిల్లలను రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదివించే బాధ్యతను తెరాస ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్రంలో 1,950 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడితే ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తెరాస. భాజపా పాలిత గుజరాత్‌లో అక్రిడేషన్‌ కార్డులు వెయ్యి మాత్రమే ఉన్నాయి.  జర్నలిస్టులకు నాణ్యమైన ఆరోగ్య స్కీం తీసుకొస్తాం. అత్యున్నత ప్రమాణాలతో యూనియన్‌ కార్యాలయం ఏర్పాటు చేస్తాం. అండగా ఉన్న ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జర్నలిస్టులు తోడ్పాటుగా నిలుస్తూ ఆశీర్వదించాలి. తెరాస ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 1.33 లక్షల ఉద్యోగాలను ఇచ్చాం.

మాట్లాడటం మొదలు పెడితే తట్టుకోలేరు..

”మేం మాట్లాడటం మొదలు పెడితే తట్టుకోలేరు. మాటలతో చీల్చి చెండాడాలంటే కేసీఆర్‌ను మించిన వారు లేరు. ప్రధాని మోదీ, అమిత్‌షా తదితరులపై మేం మాట్లాడలేక కాదు.. వారి వయసు, పదవికి గౌరవం ఇస్తున్నాం. అందుకే అలా మాట్లాడడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుంటే టీ కాంగ్రెస్‌, టీ భాజపాలు ఎక్కడివి?” అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Other News

Comments are closed.