బొగ్గు గనులను ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలి

హైదరాబాద్‌: బొగ్గు కుంభకోణం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని తెరాస డిమాండ్‌ చేసింది. రూ.లక్షా 86 వేల కోట్లు ఈ కుంభకోణంలో దుర్వినియోగం జరిగిందని తెలితే కేంద్రంలో చలనమే లేదని ఆ పార్టీ నేత ఈటెల రజేందర్‌ విమర్శించారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టకుండా ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలని అన్నారు.