బొత్సతో తెలంగాణ, కాంగ్రెస్ నేతల భేటీ
హైదరాబాద్: రాష్ట్ర సదస్సును తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు వేర్వేరుగా నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు డిమాండ్ వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఈ రోజు తెలంగాణ, కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర సదస్సు ఇరు ప్రాంతాల వారికీ ఒకే రోజున కాకుండా వేర్వేరుగా ఏర్పాటుచేయాలని కోరినట్లు ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. రెండు ప్రాంతాల వారికే ఒకేచోట సమావేశం నిర్వహిస్తే వైషమ్యాలు తలెత్తే అవకాశముందన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పార్టీ వీడే ప్రసక్తిలేదని, తెలంగాణలో కాంగ్రెస్‌ను బలపరుస్తూ… ప్రత్యేకరాష్ట్రం కోసం పోరాడుతుమన్నారు. సీమాంధ్రలో పార్టీ ఉనికిని కాపాడుకోవడం, జగన్‌ను ఎదుర్కోవడం వంటి సమస్యలపై దృష్టిసారించి ఆ ప్రాంతంలో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేయాలని బొత్సకు వివరించారు. సీమాంధ్ర , కాంగ్రెస్ నేతలు ముందస్తు సమావేశాలు నిర్వహించి తెలంగాణ యొక్క ప్రతినిధుల్ని రెచ్చగొడుతున్నారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు.