బొత్స వ్యాఖ్యలు వ్యక్తిగతమై ఉండవచ్చు: గాదె

హైదరాబాద్‌: తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటన్న పీసీసీ చీఫ్‌ బొత్స వ్యాఖ్యాలను మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తప్పు పట్టారు. పీసీసీ పీఠంపై ఉండి అలా మాట్లాడటం ధర్మం కాదన్న ఆయన కీలక పదవుల్లో ఉన్నవారు అలాంటి వ్యాఖ్యాలు చేయకూడదని అన్నారు. బొత్స ఏమైనా వ్యాఖ్యాలు చేసి ఉంటే అవి ఆయన  వ్యక్తిగతం మాత్రమేనని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సిరిసిల్లలో విజయ దీక్షను తెరాస అడ్డుకోవడంపై  ఆయన మండిపడ్డారు. ఒక ప్రాంతం వారు మరో ప్రాంతంలోకి వెళ్ల కుండా ఉండటానికి ఆ ప్రాంతమేమైనా పాకిస్థానా అని ఆయన ప్రశ్నించారు.