బోధనారుసుంపై పాతవిధానాన్నే కొనసాగిస్తాం: బొత్స సత్యనారాయణ

ఢిల్లీ: బోధనారుసుంపై పాత విధానాన్నే కొనసాగిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో అన్నారు. గ్యాస్‌ సమస్య పరిష్కారమైందని, బోధనా రుసుం చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని బొత్స సత్యనారాయణ చెప్పారు. ఏకీకృత ఫీజు విధానంపై 135 కళాశాలలు అభ్యంతరం వ్యక్తంచేశాయని ఆయన పేర్కొన్నారు. రూ. లక్ష లోపు ఆదాయం ఉన్న అన్ని కుటుంబాలకు బోధనా రుసుం చెల్లింపు వర్తిస్తుందన్నారు. సోనియా పట్ల విధేయత, కాంగ్రెస్‌ విధానాల పట్ల సుముఖంగా ఉన్నావారే కాంగ్రెస్‌ కార్యకర్తలంటూ బొత్స వ్యాఖ్యానించారు.