బోధనా ఫీజుల చెల్లింపులపై రేపు తుది నిర్ణయం

హైదరాబాద్‌: బోధనా ఫీజుల చెల్లింపులపై మంత్రివర్గ ఉపసంఘం రేపు తుదినర్ణయం తీసుకుంటుందని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. విద్యుర్థులందరికీ ఒకే రకమైన బోధనా ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టంచేశారు. ఏఐసీటీఈ నిబంధనలు పాటించే కళాశాలలు రాష్ట్రంలో 25కి మించి లేవని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్కో కళాశాలకు ఒక్కో ఫీజు అంశంపై ప్రభుత్వానికి అనుకూలంగా న్యాయస్థానం తీర్పు వస్తుందని పితాని ఆశాభావం వ్యక్తం చేశారు.