బ్యాంకు దోపిడీకి విఫలయత్నం

గంట్యాడ : విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బోనంగిలో గ్రామీణ వికాస బ్యాంకులో దుండగులు బుధవారం అర్థరాత్రి చోరీకి విఫలయత్నం చేశారు. తాళాలు పగులగొట్టి దోపిడీకి యత్నించారు. ఉదయం బ్యాంకు తెరిచేందుకు వచ్చిన అధికారులు విషయం గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.