భక్తులను ఆకర్షిస్తున్న 16 కిలోల డ్రైఫ్రూట్ లడ్డు.
భక్తులను ఆకర్షిస్తున్న 16 కిలోల డ్రైఫ్రూట్ లడ్డు.
40 సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో భక్తుల పూజలు.
శెట్టి కాంపౌండ్(పాత తాండూరు) గణనాథుడు.
ప్రతి ఏటా వైవిధ్యంమైన అలంకరణతో శోభాయాత్ర.
తాండూరు సెప్టెంబర్ 21(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు లోని పాత తాండూరు శెట్టి కాంపౌండ్ లో ప్రతిష్టాపించిన గణనాధునికి
పట్టప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి దర్శించుకుంటున్నారు. గత 40సంవత్సరాలుగా వీశేషపూజలు అందు కుంటున్నారు. పెద్దలు, యువత ఆధ్వర్యంలో ఘనంగా భక్తి శ్రద్ధలతో
గణనాథునికి పూజలు నిర్వహిస్తూన్నారు.
వినాయకునికి ఎంతో ప్రీతికరమైన సుమారు 16 కేజీల రైపూర్ లడ్డును తయారుచేసి వినాయ కుని ముందు ఉంచారు.వినాయక మంటపంలో డ్రై ఫుడ్ లడ్డు ఆకర్షణగా నిలిచింది.ప్రతి సంవత్సరం భక్తులను ఆకర్షిస్తూ , వైవిధ్యమైన బాణసంచా, అలంకరణతో భక్తులను మైమరి పింప చేస్తున్నారు. దీంతో పట్టణ ప్రజలు భక్తులు తరలివచ్చి వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలునిర్వహిస్తున్నారు .16 కేజీల డ్రై ఫ్రూట్ లడ్డు ఆకర్షణగా నిలవడంతో ఔరాఅని పించుకున్నారు.