భారతి ఆక్సా ప్రీమియం రూ.892కోట్లకు పెంపు

హైదరాబాద్‌:శరవేగంతో వృద్ది చెందుతున్న భారతి ఆక్సా కంపెనీ స్థూల రిటైసస్‌ ప్రీమియం 60శాతం వృద్ధితో రూ.892కోట్లకు పెంచుకున్నట్లు సంస్థ సీఈఓ అమరనాథ్‌ వెల్లడించారు.దక్షిణాది దేశాల్లొ బీమా విభాగంలో పాగా వేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకుంటూ వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు.ఆదాయ ఉత్పాదాకాలను గణనీయంగా పెంచుకునేందుకు వీలుగా ఘాతా దారుల గుర్తింపుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బీమా పంపిణీ వ్యవస్థను పటిష్ఠ చేసేందుకు భారీ ఏజెంట్ల నియామకం చేపడుతున్నామన్నారు.దక్షిణాదిలో ఇప్పటివరకు దాదాపు 4లక్షల పాలసీలను విక్రయించినట్లు భారతి ఏక్సా భీమా కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు.మోటారు వాహనాల పాలసీ దారులకు నగదు రహిత సదుపాయం కల్పించేందుకు హైదరాబాద్‌లో 67 గ్యారేజీలతోనూ నగదురహిత హస్పటలైజేషన్‌ సదుపాయం కోసం 268 ఆస్పత్రులతో ఒప్పందం చేసుకున్నామని సుబ్రహ్మణ్యం వెల్లడించారు.